వైసీపీ మంత్రులకు ఆ టెన్షన్….!?

వైసీపీ మంత్రులకు ఆ టెన్షన్....!?

0
84

పదవి అంటే ఏంటి. దాని పరమార్ధం ఏంటి. నలుగురి ద్రుష్టిలో పడేందుకు. వారి ముందు దర్పం చూపించేందుకే పదవి. లేకపొతే ఎంత పెద్ద కుర్చీ ఎక్కినా ఒక్కటే. హోదా కావాలి. హవా చలాయించాలి. ఇదే కదా అందరికీ కావాల్సింది. మరి వైసీపీ మంత్రులు పాతిక మంది వున్నారు. వారికి ఆ హోదా దక్కుతుందా అన్న టెన్షన్ పట్టుకుందిట.

అదే జెండా పండుగ వేళ జాతీయ జెండాను ఆవిష్కరించే హోదా. ఆ రోజున ప్రతీ జిల్లాలో అక్కడి మంత్రి దర్జాగా తన జిల్లా వాసుల ముందు నిలబడి జెండా వందనం చేస్తారు. శకటాలను వీక్షిస్తారు. ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారు. మరి ఆ అరుదైన అవకాశం ఇపుడు వైసీపీ మంత్రుల్లో ఎంతమందికి దక్కుతోంది అన్న ప్రశ్న వేసుకుంటే పదమూడు జిల్లాలు కాబట్టి పదముగ్గురికే అవకాశం అన్నది సింపుల్ సమధానం.
అంటే మరో పన్నెండు మంది అలా ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఉండిపోవాల్సిందేనా. ఇదే ఇపుడు వైసీపీ మంత్రులలో టెన్షన్. జగన్ ప్రతి జిల్లాకు కచ్చితంగా ఒక మంత్రి వంతున తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. కొన్ని జిల్లాల్లో ఇద్దరు ముగ్గురుకి కూడా అవకాశం ఇచ్చారు. వీరు కాకుండా ఇంచార్జి మంత్రులు కూడా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు జిల్లాలో జెండా పండుగ వేళ ఎవరు జెండాను ఆవిష్కరిస్తారు.

ఇది పెద్ద ప్రశ్నగా, చర్చగా ఉంది. శ్రీకాకుళంలో చూసుకుంటే ఏకైక మంత్రిగా ధర్మాన క్రిష్ణదాస్ ఉన్నారు. ఆయన జెండా ఎగురవేస్తే చూడాలని అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఇంచార్జి మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ని నియమించారు. పద్ధతి ప్రకారం చూసుకుంతే వెల్లంపల్లి ఎగురవేయాలి. దాంతో ధర్మాన వర్గీయుల్లో అసంత్రుప్తి కనిపిస్తోందట. అలాగే విశాఖ జిల్లాకు మోపిదేవి వెంకట రమణ ఇంచార్జి మంత్రిగా ఉంటే అవంతి శ్రీనివాసరావు జిల్లా మంత్రిగా ఉన్నారు. ఇక్కడ కూదా అదే డౌట్ వస్తోంది. మరి జగన్ ఈ విషయంలో క్లారిటీ ఇస్తే ఎవరు జెండా ఎగురవేసేది తేలిపోతుంది.