వైసీపీ ఆ విషయంలో పదే పదే ఎందుకు తప్పు చేస్తుంది !

వైసీపీ ఆ విషయంలో పదే పదే ఎందుకు తప్పు చేస్తుంది !

0
90

కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం జగన్ సారధ్యంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని విషయాల్లో పదే పదే స్పష్టత ఇవ్వకపోవటంతో చివరికీ ఆ హామీని నెరవేర్చిన నిరసన సెగలు తప్పడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడాదికి ప్రతి రైతుకీ 6వేల రూపాయలు ఇస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అదనమా, దాన్ని కూడా 12,500 రూపాయల్లో కలుపుతారా అనేదే ప్రశ్న.

అయితే ఈ ప్రశ్నకు ఆర్థికమంత్రి బుగ్గన అసెంబ్లీలో తెలివిగా సమాధానం చెప్పారు. గతంలో నీరు-చెట్టు లాంటి పథకాలకు కేంద్ర పథకాలను జతచేసి నిధులు వాడుకున్నారు కదా, ఇప్పుడు మేం చేస్తే తప్పేంటి అని ప్రతిపక్షం నోరు మూయించారు. టీడీపీ సంగతి పక్కన పెడితే సామాన్య రైతులకు మాత్రం ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో, ఎవరో ఆందోళన చేస్తే సర్దిచెప్పడం కాదు, ముందే స్పష్టత ఇచ్చేస్తే అసలు ఏ గొడవా ఉండదు.
ఇటీవల రేషన్ డీలర్ల విషయంలో కూడా ఇదే జరిగింది. దాదాపు 20 రోజుల పాటు తమ ఉపాధి కోసం డీలర్లు ఆందోళనకు దిగారు. గ్రామ వాలంటీర్లతో తమకు ఇబ్బంది వస్తుందేమోనని మనసు కష్టపెట్టుకున్నారు. పోనీ టీడీపీ ప్రోద్బలంతోనే ఇది జరిగింది అనుకుందాం. గ్రామ వాలంటీర్ల ప్రకటన విడుదల చేసినరోజే డీలర్లకు వీరితో సమస్యలేదు అని ప్రకటిస్తే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు కదా. నూతన ఇసుక విధానంపై కూడా ప్రభుత్వం ఇంత తాత్సారం ఎందుకు చేస్తోందో అర్థం కావడంలేదు. నిబంధనలు ముందే చెప్పేసినా కొత్త విధానం కోసం సెప్టెంబర్ 1 వరకు వేచిచూడాల్సిన పరిస్థితి. ఈలోపు నిర్మాణదారులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.