రాజీనామా చేస్తా వైసీపీ ఎమ్మెల్యే సంచలనం….

రాజీనామా చేస్తా వైసీపీ ఎమ్మెల్యే సంచలనం....

0
93

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిపేరుతో 29 గ్రామాలకు చెందిన రైతులనుంచి భూములు తీసుకున్నారని ఆరోపించారు… ఈ 29 గ్రామాల్లో కనీస మౌళిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు…

చంద్రబాబు నాయుడు 29 గ్రామాల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు నిరూపిస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు ఆళ్లరామకృష్ణా రెడ్డి… ఇప్పటికీ గ్రామాల్లో సరైన రోడ్లు లేవని అన్నారు… డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు…

ఇటీవలే రాజధాని రైతులు జగన్ కలిసిన సంగతి తెలిసిందే… అయితే వారు నిజమైన రైతులు కాదని ఆళ్లరామకృష్ణా రెడ్డి బంధువులను టీడీపీ నాయకులు ఆరోపించారు… దీనిపై స్పందించిన ఆళ్లరామకకృష్ణా రెడ్డి జగన్ కలిసిన వారి ఆధార్ కార్డ్ రేషన్ కార్డులను అలాగే వారికి ఎక్కడెక్కడు భూములు ఉన్నాయో వాటన్నింటిని మీడియాకు వివరించారు…