ఏపీకి మూడు రాజధానులు రావచ్చని ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు… దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.. జగన్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని చంద్రబాబు నాయుడు విమర్శలు చేయగా… ఉన్న రాజధానికే దిక్కులేద మళ్లీ మూడు రాజధానులా అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు…
వీరి ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే కొట్టం సత్యనారాయణ ఫైర్ అయ్యారు… చంద్రబాబు నాయుడు కేవలం తమ సామాజిక వర్గానికి, బంధువులకు పార్టీ కార్యకర్తలకు అమరావతిలో భూములు ముట్టజెప్పారని ఆయన ఆరోపించారు… ఏపీలో మూడు ప్రాంతాలు దృష్టిలో ఉంచుకుని వైసీపీ వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు…
పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం పనికి మాలిని రాజకీయం చేస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు… పవన్ చంద్రబాబు నాయుడు పెంపుడు చిలకలా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు…