వైసీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్…

వైసీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్...

0
89

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో 25 నుంచి 27 వరకు అంటే మూడు రోజులు జిల్లాలో విస్రృతంగా పర్యటించనున్నారు…. అయితే ఈ పర్యటనపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు…

చంద్రబాబు నాయుడు ఎందుకు కడప జిల్లాలో పర్యటించనున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు… దీనిపై కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస రెడ్డి స్పందించారు… చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనపై వైసీపీ నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు…

ప్రజలకోసం ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అని అన్నారు.,.. అధికారంలోఉన్నా లేకున్నా కూడా తాము ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు… ఈ పర్యటనలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చంద్రబాబును కలుస్తామంటే వారికి అపాయింట్ మెంట్ ఇప్పిస్తామని శ్రీనివాసరెడ్డి అన్నారు…