జగన్ కు వ్యతిరేకంగా మారిన వైసీపీ ఎమ్మెల్యే

జగన్ కు వ్యతిరేకంగా మారిన వైసీపీ ఎమ్మెల్యే

0
88

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాధానులు రావచ్చనే ప్రతిపాధనలు చేసిన సంగతి తెలిసిందే… వికేంద్రీకరణ దిశగా రానున్న రోజుల్లో ఏపీలో మూడు రాజధానులుగా ఏర్పడే అవకాశం ఉందని అన్నారు…

అమరావతిలో లెజిస్లేటర్ క్యాపిటల్ రావచ్చు, విశాఖ పట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చు, కర్నూల్ జిల్లాలో జుడిషియల్ క్యాపిటల్ రావచ్చని జగన్ అన్నారు… అయితే ఈ ప్రతిపాధనకు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించారు…

అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా ఉంచాలని అన్నారు ఆయన… తాజాగా పార్టీ కార్యాలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు… దీంతో తొలిసారిగా జగన్ ప్రకటనకు బిన్నాభిప్రాయం వినిపించింది…