మురికి కాలువలోకి దిగి వైసీపీ ఎమ్మెల్యే నిరసన

0
97

ఏపీ: నెల్లూరు రూరల్ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ వినూత్నంగా నిరసన తెలిపారు. రైల్వే, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఉమారెడ్డి గుంట మురుగు కాలువలోకి దిగి నిరసనగా బైఠాయించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందన్నారు. వందల కుటుంబాలు ఇబ్బందులు ఆవేదన వ్యక్తం చేశారు.  వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సమస్య తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షమైనా, అధికార పక్షమైనా.. సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానని, ప్రజల పక్షాన ఉంటానని తెలిపారు. ఈనెల 15న కాలువ నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే నెల 15 లోగా పూర్తి చేస్తామని అధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. రైల్వే అధికారులు మాత్రం 45 రోజుల్లోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు.