మంగళగిరి ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ ఎన్నికల్లో అక్కడ గెలుపొందారు.. ఆయన పై టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేష్ పోటీ చేశారు ఆయన అక్కడ ఓటమి పాలయ్యారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేపట్టిన ర్యాలీపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఆర్కేకి మంగళగిరి ప్రజలు ఎక్కువా, జగన్ ఎక్కువా? జగన్ మెప్పుకోసం ఇటువంటి పనులు చేద్దామనుకుంటున్నారు. ఇది కుదరదు. జగన్ ముఖ్యమా? ఓట్లేసి గెలిపించిన ప్రజలు ముఖ్యమా అని ప్రశ్నించారు.
అయితే జగన్ రాజధానిపై తీసుకున్న నిర్ణయంతో అందరి కంటే ఎక్కువగా మంగళగిరిలో ఆర్కేకి పెద్ద తలనొప్పి అయింది. జగన్ ప్రకటన చేసిన సమయం నుంచి టీడీపీ తరపున రాజధాని విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు, రైతుల ఆందోళన బాటపట్టారు..వీరికి జనసేన టీడీపీ మద్దతు ఇస్తోంది, తెలుగుదేశం జనసేన రెండు పార్టీలుకూడా రాజదాని రైతుల వెంట ఉన్నారు, తాజాగా రాజధాని ఉన్న ప్రాంతం మంగళగిరి కావడంతో ఎమ్మెల్యే ఆర్కేని టీడీపీ నాయకులు టార్గెట్ చేశారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంగళగిరిలో లోకేశ్ బాబు మళ్లీ పోటీ చేస్తారు. లోకేశ్ గెలిస్తే అమరావతిని ఇక్కడే ఉంచండి. ఈ సవాలుకి ఒప్పుకుంటారా అని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. నాటకాలు ఆడొద్దు మా సవాలును స్వీకరించాలి అని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ఎలా చెబితే ఆలా ఆర్కే నడుచుకుంటారు అని విమర్శించారు ఆయన.