బీజేపీ వైపు వైసీపీ ఎంపీ చూపు

బీజేపీ వైపు వైసీపీ ఎంపీ చూపు

0
92

ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం నేతలు అందరూ వైసీపీ వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే, అయితే వైసీపీ నేతలు కూడా ఇప్పుడు మరో పార్టీ వైపు చూస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ అవసరం ఏమి ఉంటుంది అంటే పార్టీ మారాలి అని కొందరు భావిస్తున్నారు అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఓ ఎంపీ పార్టీ ఫండ్ కూడా తీసుకోకుండా తన నగదుని మాత్రమే ఖర్చు చేసి వైసీపీ తరపున గెలిచాడు.. కాని గెలిచినా కూడా ఆయనని పార్టీ అగ్రనేతలు అధిష్టానం పట్టించుకోవడం లేదు అని భావిస్తున్నాడట,

ఢిల్లీలో ఏ అధికారిని కలవాలన్న పార్టీ అధినేత…లేదంటే ముఖ్య నేతలుగా చెలామణి అవుతున్న కొద్దిమందికి సమాచారం ఇవ్వాల్సి రావడం ఎంతో ఇబ్బందిగా ఉందని ఆయన మదనపడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన బీజేపీ వైపు వెళ్లాలి అని చూస్తున్నారట, పైగా ఆ పార్టీలో కొందరి సపోర్ట్ కూడా ఉందట. మరి వైసీపీ ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంటున్నారు ఆయన అభిమానులు