వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ

0
113

వైసీపీలో ముందు నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటూ వచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి, అందుకే ఆయనని నేరుగా రాజ్యసభకు పంపారు వైయస్ జగన్, ఇక వైసీపీ లో జగన్ వెంటే ఉండి, పార్టీ కార్యక్రమాలు నాయకుల సమస్యలు ఇలా అన్నీ పరిష్కరించేవారు విజయసాయిరెడ్డి.

ఇక ఇటీవల సీఎం జగన్ కు ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య అంత సాన్నిహిత్యం లేదని వివాదాలు వచ్చాయి అని పలు వార్తలు వచ్చాయి, దీనిపై తాజాగా ఎంపీనే క్లారిటీ ఇచ్చారు. తాను చనిపోయేవరకు సీఎం జగన్కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తనను శంకించాల్సిన పనిలేదన్నారు.

తనకు పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ కు ఎలాంటి విభేదాలు గొడవలు లేవు అని తెలిపారు, తాము న్యాయవ్యవస్ధని గౌరవిస్తామని తెలిపారు, టీడీపీ నేతలు కార్యకర్తలు ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, తమ పై ఎన్ని పోస్టులు పెట్టారో లెక్కలేదని వాటిపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఎన్ని జైళ్లు అయినా సరిపోవు అని అన్నారు.