వైసీపీ నేతలు ఇళ్ల స్థలాల పేరుతో భూదందా…

వైసీపీ నేతలు ఇళ్ల స్థలాల పేరుతో భూదందా...

0
91

పేదల ఇళ్ల స్థలాల నెపంతో రాష్ట్ర ప్రభుత్వం భూదందాకు తెరలేపిందని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆరోపించారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు ఇస్తామన్న సాకుతో రైతులను బెధిరించి భూములను లాక్కుంటున్నారని ఆయన మండిపడ్డారు…

వైసీపీ నేతలు రైతులకు నామమాత్రంగా పరిహారం చెల్లించి రెండు రెట్లకు ఆ భూమిని అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు… రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు… పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షపార్టీని, టీడీపీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు చేశారు…

గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ తనకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని హామీ ఇచ్చారని అయితే హామీ ఎక్కడకు పోయిందని ఆయన ప్రశ్నించారు…