వైసీపీ కొత్త డ్రామాకు తెర

వైసీపీ కొత్త డ్రామాకు తెర

0
80

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలు వచ్చాయో అని లోకేశ్ ఆరోపించారు.. రివర్స్ టెండరింగ్ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారని అన్నారు… పేద ప్రజల పట్ల జగన్ కు ఉన్న వ్యతిరేకతని పెంచుకుంటూ పోతున్నారని తెలిపారు. 7 లక్షల పెన్షన్లు ఎత్తేశారని ఆరోపించారు..

మొన్నటి వరకూ ఒక్క పెన్షన్ కూడా తియ్యలేదు అని బుకాయించిన వైసీపీ ప్రభుత్వం, రీ వెరిఫికేషన్ పేరుతో కొత్త డ్రామా ఎందుకు మొదలుపెట్టిందని ఆరోపించారు… ఇప్పుడు 20 లక్షల రేషన్ కార్డులు ఎత్తేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసుకోవడానికి మనసెలా ఎప్పిందని మండిపడ్డారు లోకేశ్…..

మీరు… ఊరుకో రాజభవనంలో ఉండొచ్చు….పేద వాడు అద్దె ఇంట్లో ఉన్నా చెత్త రూల్స్ పెట్టి రేషన్ కార్డు తీసేస్తారా అని ప్రశ్నించారు లోకేశ్… పేద వాడి పొట్ట కొట్టి రూ.1500 కోట్లు మిగుల్చుకొని ఏం సాధిస్తారని ఆరోపించారు… ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్ మోహప్ రెడ్డి సంక్షేమ వ్యతిరేకిగా చరిత్రలో మిగిలిపోతారని అన్నారు