ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియాలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వాన్ పిక్ కేసుకు సంబంధించి రస్ అల్ ఖైమా నూతన సీఈవో ఇచ్చిన ఫిర్యాదుతో ఇంటర్ పోల్ రంగంలోకి దిగింది. రెండు రోజుల క్రితమే నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మరోవైపు, నిమ్మగడ్డను సురక్షితంగా భారత్ కు రప్పించేందుకు వైసీపీ యత్నాలు ప్రారంభించింది. సెర్బియాతో సంప్రదింపులు జరపాలని కోరుతూ భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. నిమ్మగడ్డను కస్టడీలోకి తీసుకోకుండా ఇండియాకు తిప్పి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో, నిమ్మగడ్డ విషయంలో భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
వ్యాపారవేత్త నిమ్మగడ్డ విడుదల కోసం వైసీపీ యత్నాలు
వ్యాపారవేత్త నిమ్మగడ్డ విడుదల కోసం వైసీపీ యత్నాలు