మద్యం అమ్మకాల మాటున జరుగుతున్న మాయలు ఎన్నెన్నో కొందరు వైన్ షాప్ లసిబ్బంది దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు… మద్యం విక్రయాల్లో వారి చేతివాటం జోరుగా సాగుతోంది దీంతో ఖరీదైన బ్రాండ్లు పక్కదారి పడుతున్నాయి.. ఎవ్వరికి అనుమానం రాకుండా లెక్కల్లో మాత్రం వాటిని కొనుగుగోలు చేసినట్లు చూపతున్నారన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. మందుబాబులు మాత్రం ఉన్న వాటితోనే
సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
కొన్ని ప్రాంతాల్లో వైన్ లేదని బీర్లు మాత్రమే ఉన్నాయంటూ చెబుతున్నారు.. సిబ్బంది తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది… మద్యం దుకాణాలు సాయంత్రం 7 గంటలకు బంద్ అవుతాయన్న నేపథ్యంలో అంతకుముందే వైన్ షాపుల్లో పనిచేసే ఉద్యోగులు కొందరితో కుమ్మక్కై వారికి కావాల్సిన సరుకును కొనుగోలు చేసి ఆన్ లైన్ లో నమోదు చేయడం కావాల్సి వారికి అందజేయడం జరుగుతోందన్న ఆరోపణలు మద్యం బాబుల నుంచి వినపడుతున్నాయి..
పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాల క్వార్టర్ బాటిల్ కొనుగోలుకు గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు… అయినా మద్యం దొరుకుతోందో లేదో తెలియదు… కొంత మంది మాత్రం దర్జాగా మద్యం బాటిళ్లను కొనుగోలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా వైన్ షాప్ లలో పని చేసే సిబ్బందిని అదుపులో పెట్టకపోతే ప్రభుత్వం ఆశయం నెరవేరేటట్లు కనిపించలేదు…