చిలకలూరి పేటలో వైసీపీకి బిగ్ షాక్

చిలకలూరి పేటలో వైసీపీకి బిగ్ షాక్

0
136

ఓ పక్క సీటు ఇవ్వలేదు అని జగన్ చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ కు ఏకంగా మంత్రి పదవి ఇస్తాను అన్నారు, అంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను అని చెప్పకనే చెప్పారు.. ఇక ఎమ్మెల్యే టికెట్ విడదల రజినీ బీసీ వర్గానికి చెందిన మహిళలకు ఇచ్చారు జగన్.

అయితే ఇప్పుడు ఇక్కడ మంత్రిగా పనిచేసిన నేత ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున నిలబడ్డారు.. మరి ఆయనను ఎదిరించి గెలిచే సత్తా ఉందా అంటే ఇప్పుడు ఇక్కడ పదవులు గురించి మాత్రమే చర్చించుకుంటున్నారు అంటున్నారు నేతలు.. ఇప్పుడు వైపీపీ హుషారుగా రెండు విషయాలు చెబుతుంది.. ఇక్కడ రజినీ గెలుపు ఖాయం అలాగే మర్రి రాజశేఖర్ రెడ్డికి మంత్రి పదవి రావడం పక్కా అని చెబుతున్నారు. అయితే గెలుపు రాకుండా రెండు పదవులు గురించి వైసీపీ నేతలు బాహాటంగా ప్రకటనలు చేసుకుంటున్నారు ఇది కొందరు పార్టీ నేతలకు నచ్చడం లేదు, అంతేకాదు కోట్ల రూపాయలలో పందాలు కూడా కాస్తున్నారు ఇవన్నీ పార్టీ నేతలకు కాస్త చికాగు తెప్పిస్తున్నాయి, ఇటు పుల్లారావు మాత్రం బాగా దీమాగా ఉన్నారు తాను మంచి మెజార్టీతో గెలుస్తాను అని చెబుతున్నారు, అయితే ఈసారి మర్రి రాజశేఖర్ రజినికీ సపోర్ట్ చేసినా కొందరు మాత్రం ఓటు వైసీపీ వైపు వెయ్యలేదు అని తెలుస్తోంది, జగన్ నిర్ణయం ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని చెబుతున్నారు. పేటలో వైసీపీకి షాక్ తప్పదు అని చెబుతున్నారు.