Breaking: ఆత్మకూరులో వైసీపీ ఘన విజయం

0
94

ఏపీ మంత్రి మేకపాటి గౌత‌మ్ రెడ్డి హఠాన్మారణంతో ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక‌ అనివార్యమైంది. ఈ ఉపఎన్నిక బరిలో వైకాపా తరఫున మేకపాటి విక్రమ్‌రెడ్డి, భాజపా తరఫున జి.భరత్‌కుమార్‌ యాదవ్‌, మరో 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైెస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మేకపాటి గౌతమ్ రెడ్డి 82,742 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. మరి కొద్ది సేపట్లో అధికారులు ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. అటు ఆత్మకూరు ఉపఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది బీజేపీ పార్టీ. దీంతో బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ కు ఓటమి తప్పలేదు.

వైసీపీకి – 82,888

బీజేపీ- 18,216

బీస్పీ -4773

నోటా – 3972