మున్సిపల్‌ ఫలితాల్లో వైసీపీ జోరు..

YCP strong in municipal results..tension on heap result..tension

0
75

ఏపీలో మరో ఎన్నికల ఫలితాల వేడి రాజుకుంది. తాజాగా జరిగిన మున్సిపల్ నగర పంచాయితీల్లో గెలుపెవరిదీ? ఓటమి ఎవరిదన్న ఉత్కంఠకు మరి కాసేపట్లో తెరపడబోతోంది. మరీ ముఖ్యంగా కుప్పం కుతకుతలాడుతోంది. ఇక్కడ తిరిగి తమ పట్టు నిలపుకోవాలని చూస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇది చంద్రబాబు కంచు కోట కావడంతో ఇక్కడ గెలిచి మీసం మెలేయాలని చూస్తోంది వైసీపీ.

ఏడు మున్సిపాలిటీల్లో వైసీపీ, ఒక చోట టీడీపీ గెలుపు
రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీలు వైసీపీవే
గురజాల, దాచేపల్లిలోనూ వైసీపీ విజయం
బేతంచర్ల, ఆకివీడు వైసీపీ విజయం
దర్శి మున్సిపాలిటీలో టీడీపీ గెలుపు

దాచేపల్లి (20) వైసీపీ 11, టీడీపీ 07, జనసేన-1, స్వంతంత్ర అభ్యర్థి-1
గురజాల (20) – వైసీపీ 16, టీడీపీ 3, జనసేన 1
రాజంపేట (29) వైసీపీ 13, టీడీపీ 2 వార్డులు
కమలాపురం (20) – వైసీపీ 14, టీడీపీ 2 వార్డులు
బేతంచర్ల (20) – వైసీపీ 12, టీడీపీ 4 వార్డులు
దర్శి (20) – టీడీపీకి 13, వైసీపీకి 7
ఆకివీడు (20) – వైసీపీ 12, టీడీపీ4, జనసేన-3, స్వంతంత్ర అభ్యర్థి -1