ఆ బీజేపీ నేతలకు వైసీపీ సపోర్ట్

ఆ బీజేపీ నేతలకు వైసీపీ సపోర్ట్

0
108

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని పార్లమెంటులో సంబంధిత మంత్రి వెల్లడించారని అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు అని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు… ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు….

అయితే ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు… . దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ పై దుష్ప్రచానికి ఒడిగట్టడం దారుణం అని విజయసాయిరెడ్డి అన్నారు…

కాగా విజయాసాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రతీ విషయంపై స్పందిస్తుంటారు… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తూ ట్వీట్ చేస్తుంటారు విజయసాయిరెడ్డి…