చంద్రబాబును టార్గెట్ చేశారా

చంద్రబాబును టార్గెట్ చేశారా

0
106

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే, రోజా మరోసారి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు… గతంలో కారకట్టవద్ద ఇల్లు కట్టవద్దని అధికారులు ఎంతమంది చెప్పినా చంద్రబాబు నాయుడు అధికార బలంతో కట్టించుకున్నారని రోజా అన్నారు.

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…వరద కారణంగా జరుగుతున్న నష్ట ప్రాంతాలను గుర్తించేందుకు అధికారులు డ్రోన్ కెమెరాలను ఉపయోగించారని. అయితే చంద్రబాబు నాయుడు దాన్ని అడ్డుపెట్టుకుని రాద్ధాంతం చేస్టున్నారని ఆమె మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడును తాము టార్గెట్ చేయవలసిన అవసరం లేదని అల్ రెడీ రాష్ట్ర ప్రజలు ఆయన్ను టార్గెట్ చేశారని రోజా అన్నారు. రాష్ట్రంలో ఎటు చుసినా ప్రాజెక్టులన్నీ నించుకుండల్లా పొంగి పొర్లుతున్నాయని ప్రస్తుతం దాన్ని చూసి టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు.