వైసీపీ వర్సెస్ జనసేన కాకినాడలో టెన్షన్ టెన్షన్

వైసీపీ వర్సెస్ జనసేన కాకినాడలో టెన్షన్ టెన్షన్

0
82

తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది… అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది… ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుని ఘర్షణకు దిగారు…

నిన్న ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సాక్షిగా జనసేన పార్టీ అధినేత పవర్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే… ఇక దీనికి నిరసనగా ఈరోజు జనసేన కార్యకర్తలు ద్వారంపూడి ఇంటిముందు ర్యాలీగా వెళ్తున్నారు…

ఈ క్రమంలో వారిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు… దీంతో రెండు పక్షాల మధ్య రాళ్లదాడి జరిగింది…ఘర్షణ సమయంలో పోలీస్ అధికారులు రెండు వార్గాలను అదుపు చేయలేకపోయారు… దీంతో కొద్ది సేపు కాకినాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది… ఈదాడిలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి…