వైసీపీలో వారందరు ఎందుకు మౌనంపాటిస్తున్నారు…?

వైసీపీలో వారందరు ఎందుకు మౌనంపాటిస్తున్నారు...?

0
88

రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ నేతలు కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… మిగితా ప్రాంతాల వైసీపీ నాయకులు అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు చేస్తుంటే చీరాలలో ఒక్క మాజీ ఎమ్మెల్యే ఆమంచి తప్ప ఎవ్వరు యాక్టివ్ గా లేరని అంటున్నారు…

కొద్దిరోజుల క్రితం టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన కరణం బలరాం, ఆయన కుమారుడు, మాజీ మంత్రి పాలేటి రామారావు వంటి వారు ఒక్కరు కూడా టీడీపీపై విమర్శలు చేయకున్నారు… కేవలం ఆమంచి కృష్ణ మోహన్ తప్ప ఎవ్వరు విమర్శలు చేయకున్నారని చర్చించుకుంటున్నారు…

అయితే ఇప్పటికైనా చీరాలపై అధిష్టానం దృష్టి పెట్టాలని అంటున్నారు… లేదంటే ఎవరు టీడీపీయో, ఎవరు వైసీపీయో తెలియని పరిస్ధితి నెలకొందని అంటున్నారు.. కాగా 2014 ఎన్నికల్లో ఇండిపెండెట్ గా గెలిచిన ఆమంచి ఆతర్వాత టీడీపీ తీర్థం తీసుకున్నారు… 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తీర్ధం తీసుకుని మరోసారి చీరాలనుంచి పోటీ చేశారు కానీ ఆయన ఓటమి చెందారు… ఆయనపై గెలిచిన కరణం ఇప్పుడు వైసీపీకి మద్దుతుగా ఉన్నారు…