వైసీపీలోకి గంటా గ్యారెంటీ…. ముహూర్తం ఫిక్స్

వైసీపీలోకి గంటా గ్యారెంటీ.... ముహూర్తం ఫిక్స్

0
138

ఏపీ రాజకీయాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని వ్యక్తి గంటా శ్రీనివాసరావు… రాజకీయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంతో గంటా దిట్టా అంటారు… సుమారు రెండు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న గంటా ఇప్పటివరకు ఓటమిని చూడలేదు… రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కున్నా కూడా గంటా టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు…

ఎప్పుడు అధికార పార్టీలో ఉండేందుకు ఇష్టపడే గంటాకు ఇప్పుడు కొత్త చిక్కువచ్చిందని అంటున్నారు… విపక్ష పాత్ర పోషించడానికి గంటా ఇష్టపడటంలేదట…కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఇన్ని రోజులు చర్చలు జరిపిన గంటా… ఇప్పుడు వైసీపీలో చేరడానికి సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి…

ఇటు బీజేపీ అటు వైసీపీతో పాటు సమాంతరంగా చర్చలు జరిపారు.. ఆ తర్వాత అనుచరులు మాత్రం బీజేపీలోకి వద్దే వద్దు అంటున్నారు.. దీంతో వైసీపీ తప్ప వేరే ఆప్షన్ లేదనుకున్న గంటా డైరెక్ట్ గా రంగంలోకి దిగారట… నేరుగా సీఎం జగన్ సన్నిహితుల దగ్గరకు వెళ్లి ఒకే చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి… అన్ని కుదిరితే మరో వారంలో గంటా జగన్ సమక్షంలోవైసీపీలో తీర్థం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి..