వైసీపీలోకి గంటా – ముహూర్తం ఫిక్స్

వైసీపీలోకి గంటా - ముహూర్తం ఫిక్స్

0
100

తెలుగుదేశం పార్టీ ప‌రిస్దితి ఏమిటా అనే మీమాంస ఇప్పుడు అంద‌రిలో ఉంది, ఓ ప‌క్క గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రు పార్టీని వీడి వెళుతున్నారు, ఈ స‌మ‌యంలో అస‌లు ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా పోతుందా అనే భ‌యం టీడీపీ శ్రేణుల్లో క‌నిపిస్తోంది.

అయితే ఈ రాజ‌ధాని అంశంలో 48 గంట‌లు డెడ్ లైన్ ఇచ్చిన చంద్ర‌బాబుకి మిగిలిన నేత‌లు కూడా షాక్ ఇస్తున్నారు, తాజాగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పుపై కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి, అయితే దీనిపై ఇప్పుడు ఓ క్లారిటీ వ‌చ్చిన‌ట్లు ఉత్త‌రాంధ్రా పొలిటిక‌ల్ స‌ర్కిల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆయ‌న ముందుగా ఆగస్ట్ 15 న చేరుతారు అని అనుకున్నారు అంద‌రూ, కాదు 9 లేదా 10 అన్నారు
ఇక ఇప్పుడు ఈ నెల 16వ తేదీని ఫిక్స్ చేశారు. అదే రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గంటాతో పాటు పలువురు టీడీపీ మాజీ నేతలు వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఆయ‌న వైసీపీ మ‌ద్ద‌తు దారుడుగా ఉంటారు అని అంటున్నారు.