ఎల్లో మీడియాకు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

ఎల్లో మీడియాకు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

0
105

ఎల్లోమీడియాపై ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… ఈమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయి అర్థశత దినోత్సవం పూర్తయింది… కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని వదిలి ప్రతిపక్ష నేత ఎక్కడో ఉండటమేమిటని ఎల్లో మీడియా ప్రశ్నించదు. కానీ నలుగురు కూర్చుని ప్లకార్డులు పట్టుకుంటే అమరావతి దీక్షలు 150 రోజులకు చేరాయని వార్తలు వడ్డిస్తోందని మండిపడ్డారు…

అలాగే ఇతర పార్టీల్లోకి తాను పంపించిన బానిసల గొలుసులు విప్పి పోతిరెడ్డపాడు జీఓపై చంద్రబాబు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు… వాళ్లెంత మొరిగినా న్యాయం అనేది ఒకటుంటుందని అన్నారు.

ఏపీ తన కేటాయింపులకు మించి చుక్క నీటిని కూడా అక్రమంగా తీసుకోదని సిఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారని తెలిపారు. దీనిపై మౌనీ బాబా నోరు విప్పాలని అన్నారు.