నిన్న జరిగిన దాడి మల్లారెడ్డి పై కాదు సీఎం కేసీఆర్ పైనే..?

0
105

తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి మీద దాడి జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  ఈ ఘటనపై మాల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి, అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్న జరిగిన దాడి మల్లారెడ్డి పై జరిగిన దాడిగా మేము చూడడం లేదు, సీఎం కేసీఆర్ పై జరిగిన దాడిగా భావిస్తున్నాం అని తేల్చి చెప్పాడు. మల్లారెడ్డి పై జరగాల్సిన దాడి కాదు ఇది, కేసీఆర్ పై జరగాల్సిన దాడిగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ ప్రతినిధి గా వచ్చాడు కాబట్టే మల్లారెడ్డి పై ఈ దాడి చేశారని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన అనంతరం రెడ్డి కార్పొరేషన్ వేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి టిఆర్ఎస్ పార్టీ మాట మీద నిలబడలేదని స్పష్టం చేసాడు. మేనిఫెస్టోలో పెగ్గిన హామీలు కాకుండా టిఆర్ఎస్ వ్యక్తిగా సీఎం ఇచ్చిన స్క్రిప్ట్ నే నిన్న మల్లారెడ్డి రెడ్డి సభలో మాట్లాడాడు. రాష్ట్రంలో ఏ కులాల వారు సభ పెట్టుకున్నా అధికార పార్టీ నేతలకు నిన్నటి గతే అందరికి పడుతుందని ఫైర్ అయ్యారు. రెడ్డి కార్పొరేషన్ ని అమలు చేయని,మోసం చేసిన కేసీఆర్ ని పొగుడుతుంటే సహజంగా వచ్చిన ఆవేశమే నిన్నటి ఘటన అని అందరికి అరమయ్యేలా స్పష్టం చేసాడు.

టిఆర్ఎస్ ప్రభుత్వం లో అన్ని కులాలకు అన్యాయం జారుతునందుకు ఏదో ఒకరోజు తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు తిరగపడే రోజులు మొదలవుతాయని తెలిపారు. ఇంకా అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి నన్ను చంపించే ప్రయత్నం చేశారు అనడం హాస్యాస్పదం అని తెలిపారు. రెడ్డి కార్పొరేషన్ ని అమలు చేయని,మోసం చేసిన కేసీఆర్ ని పొగుడుతుంటే సహజంగా వచ్చిన ఆవేశమే నిన్నటి ఘటన అని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేయడంతో పటు మంత్రి మల్లారెడ్డిపై కూడా తిట్ల పురాణాన్ని అమలుచేశారు.  మంత్రి మల్లారెడ్డి ఒక పిచ్చికుక్క అధికార పార్టీ మంత్రి పై జరిగిన దాడిని సొంత పార్టీ పత్రికనే గుర్తించలేదని ఫైర్ అయ్యారు.