యూపీ సీఎంగా యోగి ప్రమాణస్వీకారం

0
89

రెండోసారి ఉత్తరప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారం చేశారు యోగీ ఆదిత్య నాథ్. యోగీతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ యోగీతో ప్రమాణ స్వీకారం చేయించారు.  యోగీ క్యాబినెట్ లో 52 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ లు ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయ్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దాదాపుగా 37 ఏళ్ల తరువాత వరసగా ఓ పార్టీ వరసగా అధికారాన్ని యూపీలో చేజిక్కించుకుంది.