చాలా మంది వేరే స్టేట్స్ లో ఉంటారు వేరే దేశంలో ఉంటారు.. ఇలాంటి వారు గ్రామాల్లో పట్టణాల్లో ఐదేళ్లకి ఓసారి జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి రాలేకపోతూ ఉంటారు.. మరీ ముఖ్యంగా ఉద్యోగాలు వ్యాపారాలతో సెలవులు దొరక్క అక్కడ నుంచి ఇక్కడకు రావడానికి అనేక ఇబ్బందులు పడే వారు ఉంటారు.. చివరకు వారు ఓటు వేయలేకపోయాము అని బాధపడుతూ ఉంటారు..అయితే ఇలాంటి వాటి వల్ల దాదాపు చాలా వరకూ ఓటింగ్ శాతం కూడా తగ్గుతోంది.. అయితే ఇంత టెక్నాలజీ డవలప్ అయింది అందుకే ఉన్న చోట నుంచి ఓటు వేసే విధంగా చేస్తే బాగుంటుంది కదా అని అందరూ కూడా అడుగుతున్నారు.
ఇక మీరు ఎక్కడినుంచైనా ఓటేసే సౌకర్యాన్ని కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఇది నిజంగా దేశ ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి, సో ఇది 2024 ఎన్నికల సమయం నుంచి వచ్చే అవకాశం ఉంది.
రాబోయే రెండు మూడు నెలల్లో దానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. ఐఐటీ చెన్నై, ఇతర ఐఐటీలకు చెందిన సాంకేతిక నిపుణులు దీనిపై అధ్యయనం చేస్తున్నారు, సో ఈ పద్దతి గనుక వస్తే చాలా వరకూ ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది….వీలైతే ఆరు నెలల్లో లేదా ఏడాదిలోగా ఎన్ఆర్ఐ ఓటింగ్ పద్ధతినీ తీసుకురాబోతున్నామని తెలిపారు. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసందానం చేయనుంది కేంద్రం.
ReplyForward
|