సమోసాలకి డబ్బులు అడిగినందుకు తండ్రి కొడుకులపై వేడి నూనె పోసిన యువకులు -దారుణం

-

కొంత మంది దుర్మార్గులు ఏ పని చేయకుండా తేరగా వస్తే తినడానికి సిద్దం అవుతారు, వ్యాపారుల దగ్గరకు వెళ్లి సరుకు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గేట్టే వారు ఉంటారు, ఇలాంటి వారు చాలా మంది ఉంటారు సమాజంలో.. పాపం బతుకుతెరువు కోసం ఓ కుటుంబం లక్నో నగరంలోని గోమతి నగర్లో ఉంటున్నారు..రామ్నాథ్ యాదవ్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో సమోసాలు, పూరీలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు.

- Advertisement -

అతనికి ఇద్దరు కొడుకులు రంజీత్, ప్రదీప్ లు సహాయం చేస్తుంటారు… తండ్రికి సమోసాలు వేసే సమయంలో సాయం చేస్తూ తండ్రికి తోడుగా ఉంటున్నారు, ఈ సమయంలో రాత్రి వారి బండి దగ్గరకు కొందరు యువకులు వచ్చి పూరీలు సమోసాలు తీసుకున్నారు.

రామ్ నాథ్ యాదవ్ కొడుకు ప్రదీప్ వారికి పూరీలు ఇచ్చారు… డబ్బులు అడిగిన సమయంలో ఆ యువకులు గొడవపెట్టుకున్నారు, తిన్నా దానికి డబ్బులు ఇవ్వకుండా గొడవ ఏమిటి అని కొడుకు నిలదీశాడు, దీంతో ఆ యువకులకి కోపం వచ్చింది, వేడి వేడిగా ఉన్న నూనె బాండీపై కుమారుడ్ని తండ్రిని తోశారు, ఆ ఆయిల్ వారిపై పడటంతో గాయాలు అయ్యాయి.. దీంతో వారి అరుపులకి అక్కడ జనాలు వచ్చారు, దీంతో ఆ యువకులు పారిపోయారు, అయితే వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.. ఆ తండ్రి కుమారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు...

Dharmapuri Srinivas | కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి...