తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వినూత్న మార్పులు తీసుకొస్తున్నారు. ప్రయాణీకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి ఎ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ.. తనదైన శైలిలో వాటిని పరిష్కరిస్తున్నారు.
తాజాగా అర్ధరాత్రి ఓ యువతి చేసిన ట్వీట్ పై వెంటనే సజ్జనార్ స్పందించారు. అర్ధరాత్రి సమయాలలో ఆర్టీసీ బస్సులలో మహిళల సౌకర్యం కోసం (వాష్ రూమ్స్) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు బస్సు ఆపాలని కోరిన యువతి పాలే నిషా కోరారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆ యువతి చెప్పారు.
ఆ యువతి అభ్యర్ధనకు వెంటనే ఎండి సజ్జనార్ ట్వీట్ కి స్పందించారు. ఈ విషయం పై అధికారులకు సూచించినట్లు రీట్వీట్ చేశారు సజ్జనార్. అర్ధరాత్రి సైతం మహిళ సమస్య పై సజ్జనార్ స్పందించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ నిషా కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు సంక్రాంతికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు కూడా ఎలాంటి అనదపు ఛార్జీలు వసూలు చేయకుండా అందరూ టీఎస్ ఆర్టీసీ వైపు చూసేలా చర్యలు తీసుకున్నారు సజ్జనార్.