గ్రేటర్ పరిధిలో జరుగబోయే ఎన్నికల ప్రచారంలో అధికార నాయకులు ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై విమర్శలు చేసుకుంటున్నారు… సవాల్లు ప్రతి సవాల్లు విసురుకుంటున్నారు… ఈక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్బరుద్దీన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు…
తాజాగా ఆయన మీడితో మాట్లాడుతూ ఎన్టీఆర్ కాలిగోటికి సరిపోదు అక్బరుద్దీన్ పార్టీ మీరెంత మీ పార్టీ ఎంత అని ఆయన ప్రశ్నించారు… ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న కేటీఆర్ డ్రామాల రావు అయ్యారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు… ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకోసం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు సంజయ్…
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందే అని అన్నారు… కాగా ఇటీవలు అక్బరుద్దీన్ పీసీ సమాధి కూల్చి వేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు… అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని బండి సంజయ్ ప్రశ్నించారు..
—