2024 టార్గెట్ .. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

2024 టార్గెట్ .. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

0
83

2024 ఎన్నికల్లో గెలవడమే టార్గెట్‌గా పెట్టుకోని పని చేస్తానని వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రజలు ఎంతో నమ్మకంతో వైసీపీకి ఓట్లు వేశారని… ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పరిపాలన కొనసాగిద్దామన్నారు. వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ జగన్… రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన చేస్తానని… ఇందుకు అందరి సహకారం ఉండాలని జగన్ కోరారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పరిపాలన చేస్తానని ఆయన తెలిపారు. కేవలం ఒక్కశాతం ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమయ్యామన్న జగన్…

ఈ సారి టీడీపీతో పోల్చితే పదిశాతం అత్యధికంగా ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చామన్నారు. ఇదే సమావేశంలో టీడీపీ, చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను చంద్రబాబు డబ్బు ఎరచూపి లాక్కున్నారని ఆరోపించిన జగన్… ఇప్పుడు టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మిగిలారని వ్యాఖ్యానించారు. అతని గేలుపునే అశ్చర్యంగా చుస్తుంది దేశం ఐతే అతని పరిపాలన కూడా అసక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు జగన్.