జగన్ ఫ్రెండ్ స్పీచ్ కు లోకేష్ ఫిదా…

జగన్ ఫ్రెండ్ స్పీచ్ కు లోకేష్ ఫిదా...

0
94

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఫిదా అయ్యానని టీడీపీ నేత లోకేశ్ అన్నారు.. పార్లమెంట్ సమావేశాల్లో ఇటీవలే మిథున్ రెడ్డి ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ కంపెనీ చంద్రబాబు నాయుడు బినామీ కంపెనీ అని చెప్పారు… దీపిపై లోకేశ్ స్పందిచారు… అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారు. ఆ కంపెనీ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. కంపెనీ పేరు కూడా తెలుసుకోకుండా ‘ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబు బినామీ కంపెనీ’ అంటూ పార్లమెంటులో వైసీపీ ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ నన్ను ఫిదా చేసిందని లోకేశ్ అన్నారు…

ఫ్రాంక్లిన్ చంద్రబాబు బినామీ కంపెనీ కదా.. అలాంటి ఆ కంపెనీలో మీరెందుకు పెట్టుబడులు పెట్టారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నిలదీయండి మిథున్ రెడ్డి అని ప్రశ్నించారు… ఒక అంతర్జాతీయ సంస్థ ఉత్తరాంధ్రకి రావడం జగన్ కి మొదటి నుండి ఇష్టం లేదని లోకేశ్ మండిపడ్డారు

అలాగే ఉత్తరాంధ్ర యువతకి మంచి కంపెనీలో ఉద్యోగాలు రావడం వైసీపీ నాయకులకు రుచించడం లేదని ఆరోపించారు. ఎప్పటికీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండాలి అనే దురుద్దేశంతో కంపెనీలు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు లోకేశ్. బినామీ కంపెనీలు అంటూ చెత్త మాటలు మాట్లాడుతున్నారు కాబట్టే కంపెనీలు జగన్ మోహన్ రెడ్డిని చూసి బై బై ఏపీ అంటున్నాయని అన్నారు లోకేశ్…