జగన్ జైలుకు వెళ్తే…. ఆ ఇద్దరు సీఎం

జగన్ జైలుకు వెళ్తే.... ఆ ఇద్దరు సీఎం

0
77

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే ఆయన కెబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి కావాలని తపన పడుతున్నారా అంటే అవుననే అంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి పంచముర్తి అనురాధ…

తాజాగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆమె హెచ్చరించారు… కొద్దికాలంగా వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు…

రాజధాని రైతులు ఆందోళన గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు… కొద్దికాలంగా టీడీపీ నాయకులు ప్రజల కొంతు వినిపిస్తున్నారని అయితే వారిని వైసీపీ నాయకులు వీది రౌడీలుగా చిత్రీకరిస్తున్నారని అనురాధ ఆరోపించారు.. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతారో అర్థం కాదని ఆరోపించారు…