ఏపీ సీఎం జగన్ కేంద్రంతో నెక్ట్స్ ప్లాన్ ఏంటి

ఏపీ సీఎం జగన్ కేంద్రంతో నెక్ట్స్ ప్లాన్ ఏంటి

0
109

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తా అంటున్నారు.. అసలు ఆయన చేయవలసిన ముందు కర్తవ్యాలు ఏమి ఉంటాయి అంటే,
శాసనమండలిని రద్దు చేయాలంటే .. ముందుగా న్యాయనిపుణుల సలహా తీసుకోవాలి. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తెలుసుకోవాలి.
ఈ విషయం పై కేబినెట్లో తీర్మానం ఆమోదించాలి.

కౌన్సిల్ను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలి. ఈ సమయంలో అక్కడ పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రస్తావించాలి.
రద్దు తీర్మానాన్ని పార్లమెంటు కార్యదర్శికి పంపించాలి. అక్కడి నుంచి ఇది కేంద్ర హోం శాఖకు వెళుతుంది.
కేంద్ర హోం శాఖ స్పందించి… రద్దు బిల్లును పార్లమెంటు ఉభయ సభలకు పంపించాలి. ఉభయ సభల అనుమతి పొందాక.. రాష్ట్రపతి సంతకంతో నోటిఫికేషన్ వెలువడుతుంది. అప్పుడు మండలి రద్దు నిర్ణయం అమలులోకి వస్తుంది.

అయితే ఇదంతా కేంద్రానికి పంపినా వారు జగన్ కు సపోర్ట్ చేసి అలా ముందుకు సభల్లో బిల్లు పెట్టాలి.. లేకపోతే అసలు జగన్ కు ఈ విషయంలో ఎదురుదెబ్బ తగులుతుంది. ఇప్పటికే బీజేపీ ఈ విషయంలో రెండు దోరణులు చూపిస్తోంది, ఈ సమయంలో జగన్ కు సపోర్ట్ చేయాలి అంటే వెంటనే ఈ మండలి రద్దు బిల్లు యాక్సెప్ట్ చేయించాలి. ఇలా చేస్తే మాత్రం, బీజేపీ జగన్ కు సపోర్ట్ అనేది ఇక్కడ ప్రజలకు అర్ధం అవుతుంది, మరి చూడాలి ఈ బిల్లుల అంశం ఏమవుతుందో.