ఉత్తరాంధ్రలో జగన్ కు ఎన్నివేల ఎకరాల భూమి ఉందో తెలుసా…. తెలిస్తే షాక్

ఉత్తరాంధ్రలో జగన్ కు ఎన్నివేల ఎకరాల భూమి ఉందో తెలుసా.... తెలిస్తే షాక్

0
88

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో భారీ మొత్తంలో భూమి ఉందని పీసీసీ కార్యదర్శి ఎన్.. తులసి రెడ్డి ఆరోపించారు…. తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..

విశాఖపట్నం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జగన్ మోహన్ రెడ్డి భినామీ పేర్లమీద సుమారు 32 వేల ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు వాటన్నింటిని త్వరలో వివరిస్తామని తులసిరెడ్డి అన్నారు… ఆ ఆస్తుల విలువ పెంచుకోవడానికి మూడు రాజధానులు అంటున్నారని జగన్ కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదని ఆరోపించారు…

వైఎస్ హయాంలో జగన్ ఉత్తరాంధ్రలో భూములు కొన్నారని ఆరోపించారు తులసి రెడ్డి… శాసనసభ, శాసన మండలి రెండు కలిపి ఉంటే దాన్ని రాజధాని అంటారని తెలిపారు… హైకోర్టు రాజధాని పరిధిలోకి రాదని అన్నారు… చంద్రబాబు, జగన్ సీమ ద్రోహులని ఆరోపించారు…