సున్నా వడ్డీపై నిన్న..నేడు..అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు

సున్నా వడ్డీపై నిన్న..నేడు..అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు

0
94

సున్నా వడ్డీ పథకంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం సభలో టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గొడవ మొదలైంది. అధికార, విపక్ష సభ్యులు పరస్పర విమర్శలకు దిగారు. సున్నా వడ్డీ రుణాలు చంద్రబాబుతో రాజీనామా సవాల్‌పై జగన్ నిన్న ఏమన్నారంటే.. రైతులకు సున్నా వడ్డీ కింద టీడీపీ ప్రభుత్వం ఎంత డబ్బు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంత ఇచ్చింది రికార్డులు తన వద్ద ఉన్నాయని, ఇప్పుడే తెప్పిస్తానని.. వెంటనే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతారా? అని జగన్ సవాల్ చేశారు.

నేడు (శుక్రవారం) అసెంబ్లీలో జగన్ ఏమన్నారంటే… మామూలుగా దమ్మిడి ఇవ్వలేని అంటుంటామని, దమ్మిడి ఇవ్వలేదంటే దానర్థం రూ. లక్ష ఇవ్వాల్సిన చోట రూ. 2 ఇచ్చి.. అది దమ్మిడి కంటే ఎక్కువ ఉంది.. మొత్తం ఇచ్చేశాము అని చెబుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు.