తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి అనే చెప్పాలి, తెలంగాణలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని నియమిస్తే తాను పార్టీలో ఉండబోనంటూ సంచలన కామెంట్ చేశారు వీహెచ్, దీంతో రేవంత్ అభిమానులు దీనిపై ఆగ్రహం చెందారు, ఏకంగా ఆయనకు బెదిరింపులు వచ్చాయి, దీనిపై వీహెచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వీహెచ్ కొన్ని కామెంట్లు చేశారు, ఇవి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. నాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్సార్ గురించి చెప్పారు ఆయన.
పీజేఆర్ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు… ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు.. కొంత కాలం నాకు ఆయనకు ఫైట్ ఉండేది.. కాని తర్వాత ఇద్దరం కలిసి అన్నదమ్ముల్లా ఉన్నాం… అప్పుడు వైయస్ ఆర్ నాతో ఇలా అన్నారు. హనుమంతరావ్ నువ్వు జనార్ధన్ రెడ్డి వదిలేయ్. నా వెంబడి ఉండు. నీకు అన్ని విధాలా చేస్తానని వైఎయస్ ఆఫర్ చేశారు.
నేను పీజేఆర్ వెంటే ఉన్నాను అని తెలిపారు ఆయన.