వ్యూహం మార్చిన వైఎస్ షర్మిల..హుజురాబాద్ లో ఆమె ప్లాన్ ఇదేనా?

YS Sharmila changed strategy in Huzurabad By elections

0
105

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హుజురాబాద్ బైపోల్ లో తన వ్యూహం మార్చినట్లు తెలుస్తుంది. గతంలో హుజురాబాద్ లో పోటీ చేయబోమని చెప్పిన షర్మిల, బైపోల్ ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారట. నిరుద్యోగ సమస్యపై నిరాహార దీక్ష చేపట్టిన షర్మిల తన పార్టీ నుండి అభ్యర్థిని నిలబెట్టకుండా 200 మంది నిరుద్యోగులను పోటీలో దింపాలని స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.

హుజురాబాద్ లో ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం ముమ్మరం చేయగా ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది తెలియనుంది. నిరుద్యోగ సమస్యను షర్మిల ఒక బ్రహ్మాస్త్రంగా మార్చుకొని టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పసుపు బోర్డు ఉద్యమం తరహా రైతులు పోటీగా నామినేషన్లు వేసినట్టుగా హుజురాబాద్ లో నిరుద్యోగులను బరిలో ఉంచి తన బలమెంటో ప్రతిపక్ష పార్టీలకు చూపించాలని షర్మిల చూస్తున్నట్లు సమాచారం.

కాగా తెలంగాణలో వైఎస్సార్ టీపీ పెట్టిన తరువాత తన వ్యూహకర్తగా ప్రశాంత్ ఉంటారని గతంలో షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిషోర్ టీం సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.