YS షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ పేరు వైస్సార్ తెలంగాణ పార్టీ గా నామకరణం చేసినట్లు సమాచారం. అయితే తాజాగా వైస్సార్ తెలంగాణ పార్టీ గుర్తింపు కోరుతు ఎన్నికల సంఘాన్ని షర్మిల కోరినట్లు తెలుస్తుంది.
వైస్సార్ తెలంగాణ పార్టీ పేరు పై అభ్యఅంతరాలు ఉంటే తెలపాలని ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది. ప్రస్తుతం షర్మిల రాజకీయ కార్యకలాపాల సమన్వయ కర్తగా రాజా గోపాల్ వ్యవహరిస్తున్నాాడు. ఈ పార్టీ కి గుర్తింపు వచ్చిన తరువాత అధ్యక్షురాలిగా షర్మిలను ఎన్నుకునే అవకాశం ఉంటుందని సమాచారం.