కరీంనగర్ గడ్డ మీద రాజన్న బిడ్డ

Ys Sharmila Reddy Karimnagar Tour

0
113

పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత రాజన్న బిడ్డ, జగనన్న వదిలిన బాణం కరీంనగర్ గడ్డ మీద శుక్రవారం కాలు మోపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ములుగు మండలం ఒంటిమామిడి మార్కెట్ యార్డ్ ముందు ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తొలిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వచ్చిన షర్మిలకు కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రాజీవ్ రహదారిపై ఉన్న ప్రజ్ఞాపూర్ వద్ద ఉన్న వైఎస్సార విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అల్మాస్ పూర్ లో కరోనా తో మరణించిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని ఆమె ప్రకటించారు. సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని షర్మిల తెలిపారు. త్వరలోనే తెలంగాణకు మంచిరోజులు రాబోతున్నాయని భరోసా ఇచ్చారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న షర్మిల ఆ దిశగా జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు.
అలాగే ఎల్లారెడ్డిగూడ మండలంలోని పదిరే గ్రామంలో ఉన్న ఆరుట్ల విక్రమ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుట్ల విక్రమ్ రెడ్డి మరణించారు. విక్రమ్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్ పర్యటన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మిగతా జిల్లాల్లో షర్మిల యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు పార్టీ నేతలు.