Breaking News : హుజూరాబాద్ ఎన్నికలపై వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం

Ys Sharmila Sensational comments on huzurabad by elections

0
137

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ వైఎస్సార్ టిపి పోటీ చేసే విషయమై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. శనివారం ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఒక ప్రకటన చేశారు. రాబోయే హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో తమ పార్టీ పోటీ చేయబోదని తేల్చారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ ఎన్నికల వల్ల దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా? నిరుద్యోగాలకు ఉద్యోగాలు వస్తాయా? అని నిలదీశారు. ఇవన్నీ చేస్తామంటే అప్పుడు మేము కూడా పోటీ చేస్తాం అని షర్మిల స్పష్టం చేశారు. కేవలం పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నికలు మాత్రమే హుజూరాబాద్ ఉప ఎన్నికలు అని షర్మిల ట్విట్టర్లో వివరించారు.

https://twitter.com/realyssharmila/status/1416335234895794177