కేటిఆర్ పెద్ద మొగోడా? షర్మిల ఫైర్

0
99

వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లోని నివాసంలో శుక్రవారం మీడియాతో పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను గతంలో ‘‘నేనూ… జగనన్న వదిలిన బాణాన్ని’’ అంటూ పాదయాత్ర చేశారు. కానీ ఇప్పుడు మాట మార్చారు. తాను ఎవరో వదిలిన బాణం కాదని.. ప్రజల బాణాన్ని అంటూ కొత్త రాగం అందుకున్నారు. అంతేకాదు.. తన తండ్రి ఎక్కడినుంచైతే పాదయాత్ర మొదలెట్టారో చేవెళ్ల నుంచే తానూ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. కేటిఆర్ కు గట్టి చురకలే అంటించారు. కేటిఆర్ అంటే ఎవరు? ఆయన గొప్ప మొగోడా? అంటూ క్లాస్ పీకారు. ఇంకా ఏమన్నారో ఆమె మాటల్లోనే చదవండి.

తెలంగాణ గడ్డ మీద వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించాం. వైఎస్సార్ తెలంగాణ కి వ్యతిరేకా,  కాదా అనేది మీరే మీమీ గ్రామాలకు వెళ్లి అడగండి. వైఎస్ తెలంగాణ కు, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకి కాదు. 2004, 2009 లో తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత కోసం కృషి చేశారు. 5 సంవత్సరాలు సీఎం గా ఉండి,  46 లక్షల ఇండ్లు కట్టించాడు. ఇన్నేళ్లు సీఎం గా ఉన్న కేసీఆర్ 1 లక్ష ఇళ్లయినా కట్టాడా? వైఎస్ చనిపోయాకే ప్రజలకి భయం పట్టుకుంది.

ఉద్యమంలో పాల్గొనని వారికి తెలంగాణ పట్ల ప్రేమ లేదని అనడం సరికాదు. మేము తెలంగాణకి ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు… తెలంగాణ ను ఇవ్వాల్సిందే అని చెప్పాము. YSRTP ప్రజల పార్టీ… అన్నతో గొడవపడి, అలిగి పెట్టిన పార్టీ కాదు. ఇది గుండెల్లో నుండి పుట్టిన పార్టీ. తెలంగాణ ప్రజల కోసం పెట్టిన పార్టీ. తెలంగాణలో కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు ?. పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే పెట్టాను. నిరుద్యోగ సమస్య తీరిందా? బీసీ, ఎస్సి, ఎస్టీలకు న్యాయం జరిగిందా? KRMB, GRMB ని ఎప్పుడైనా కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారా? కేసీఆర్ సీరియస్ గా తీసుకుని, బోర్డులు పిలిచిన మీటింగ్ లకు వెళ్లాడా? మీటింగ్ లకు వెల్లనప్పుడు కేసీఆర్ కి అడిగే హక్కు ఎక్కడిది? కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ కు హక్కుగా ఉన్న ఒక్క చుక్క నీటిని వదులుకోము… ఇతర రాష్ట్రాల నీటిని తీసుకోము. రాజన్న రాజ్యం కావాలా? రాక్షస రాజ్యం కావాలా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు.. గత ఎన్నికల్లో AP లో నిర్ణయించారు. కేటిఆర్  అంటే ఎవరు? కేటీఆర్ ఎవరు  ?  ఓహో ముఖ్యమంత్రి  కేసీఆర్ కొడకా…! కేసీఆర్ మహిళలను గౌరవించరు… ఇక ఆయన కొడుకు గౌరవిస్తాడా? కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలి? అని అర్ధమా? నేను నిరుద్యోగుల కోసం వారానికి ఒకసారి అన్నం మెతుకు ముట్టకుండా వ్రతం చేస్తున్నా. మరి పెద్ద మొగోడు కేటీఆర్ ఏం చేస్తున్నాడు?

కాంగ్రెస్ పార్టీ 2004 నాటికి చచ్చిపోయిన పార్టీ. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు నిలబెట్టింది వైఎస్సారే. వైఎస్సార్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం ఇక్కడి ప్రజల బాగోగుల కోసమే. కేసీఆర్ ప్రభుత్వం అసలు ఏం చేసింది ఈ ప్రజలకి? కేసీఆర్ సీఎం గా విఫలం అయ్యారు. 54 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. పార్టీ అంటే ప్రజలు.. మహానేత ఆశయాల కోసం పెట్టిన పార్టీ YSRTP. నేను ఒంటరి అనే భయం, బాధ ఎప్పుడూ లేదు. కోట్ల మంది ysr అభిమానుల్లో ఉన్నాను. జంపింగ్ జపాంగ్ లు నాకు అవసరం లేదు… నిఖార్సయిన లీడర్లు కావాలి. ప్రజల నుండి నాయకులను తీసుకోస్తాం. ఏదో ఒకరోజు అధికారం చేపట్టి ప్రభంజనం సృష్టిస్తాం. పగలు, ప్రతీకారాల కోసం వచ్చిన ఎన్నికే హుజూరాబాద్ ఉప ఎన్నిక. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరిస్తే మేము పోటీ చేస్తాం. ప్రజలకోసం వచ్చిన ఎన్నికా ఇది? సో..అర్థం లేని హుజూరాబాద్ ఎన్నికల్లో మేము పోటీ చేయం. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయిన పార్టీ. బీజేపీ, టిఆర్ఎష్ తో కుమ్మకైంది. వైఎస్సార్ టిపి మాత్రమే ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. నా పాదయాత్ర కూడా చేవెళ్ల నుండే ప్రారంభిస్తాం. ఏపీలో రెండేండ్లయింది జగన్  ప్రభుత్వం వచ్చి. రాజన్న రాజ్యం కోసం పాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. లేదంటే ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తారు.

జగన్, కేసీఆర్ ఇద్దరూ స్నేహితులే. కాంగ్రెస్ పార్టీ YSR కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది వైఎస్సార్. కాంగ్రెస్  వైఎస్ కు వెన్నుపోటు పొడిచింది. కాంగ్రెస్ కి సిగ్గులేదు.  నేను ఎవరో వదిలిన బాణాన్ని కాను… ప్రజల బాణాన్ని.