తెలంగాణ ఏర్పాటుపై వైఎస్‌ షర్మిల బహిరంగ ప్రకటన

YS Sharmila's public statement on the formation of Telangana

0
149

ఏపీ,తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో.. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఈ విషయంపై వైఎస్‌ షర్మిల బహిరంగ ప్రకటన చేశారు. తెలంగాణ ఇచ్చిన వారికైనా .. తెలంగాణ తెచ్చిన వారికైనా .. తెలంగాణ కోసం కొట్లాడిన వారికైనా .. ఎవరికైనా తెలంగాణ సాధించిన పుణ్యం దక్కాలంటే .. సాధించిన తెలంగాణాలో చావులు లేకుండా చూడాలంటూ ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి పట్టించుకోని వారు… తెలంగాణ ఎలా ఏర్పడిందని కొట్టుకు చస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధించిన తెలంగాణలో చావులు ఆగాలని ముఖ్యంగా రైతులు అలాగే నిరుద్యోగుల చావులు ఆపాలని అదే నిజమైన రాష్ట్ర సాధన అని ఆమె పేర్కొన్నారు.