ఉమ్మడి నిజామాబాద్ లో వైఎస్ షర్మిల పర్యటన

YS Sharmila's visit to Nizamabad jointly

0
102

జనం బాట పట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బిచ్కుంద మండ‌లం షెట్లూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి చెంద‌గా..బాధిత కుటుంబాన్ని, బంధువుల‌ను కలిసి సానుభూతి తెలియచేశారు.

ఇది వరకు జాబ్ నోటిఫికేషన్ కోసం వైఎస్ షర్మిల చేసిన 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ప్రతి మంగళవారం దీక్ష కొనసాగించేలా నిరుద్యోగ నిరాహర దీక్ష ఆందోళనను చేపట్టారు వైఎస్ షర్మిల. ప్రతి మంగళవారం ఎంపిక చేసిన జిల్లాలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తూ వస్తున్నారు. తొలిసారిగా కిందటి నెల 13వ తేదీన వనపర్తి జిల్లా తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్షను ప్రారంభించారు.