తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీని ప్రభావంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఇక తాజాగా YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటువరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
ఇవాళ ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
షర్మిల పర్యటన షెడ్యూల్ ఇలా..
ఉదయం 7 గంటలకు -లోటస్ పాండ్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభం
మధ్యాహ్నం 12గం- కడెం ప్రాజెక్టు నష్టం పరిశీలన
3:30pm – పోసయ్య గూడెం- పోడు రైతుల ఇంటరాక్షన్
రాత్రి 7గం – రామగుండం రాత్రి బస.
ఈ నెల 22న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటన
ఉదయం 8 గంటలకు – రామగుండంలో ప్రారంభం
ఉదయం 10గం – మంథని- నిరసన తెలుపుతున్న రైతులతో ఇంటరాక్షన్
మధ్యాహ్నం 2:30 గంటలకు అన్నారం మరియు కన్నెపల్లి పంప్ హౌస్
4:30 pm – పలిమెల మండలం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం (BHPL జిల్లా)
7:30pm – బయ్యారం (BKDM జిల్లా) రాత్రి బస
ఈ నెల 23న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన
ఉదయం 8గం – బయ్యారం -రెడ్డి పాలెం వరద బాధితులతో సంప్రదింపులు
11:30am – బుర్గన్‌పహాడ్ – క్షేత్రాల సందర్శన
మధ్యాహ్నం 3గం – భద్రాచలం సందర్శన