వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బీజీ బిజీగా ఉన్నారు.. పార్టీ తరపున నాయకులు అందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.. తాజాగా వైయస్ విజయమ్మ – వైయస్ షర్మిల ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు…వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈరోజు ఉదయం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇక ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ పాలనతో పోల్చినప్పుడు ప్రస్తుత పాలన చూస్తే చాలా బాధ వేస్తుంది. రాజన్న పాలన మళ్లీ చూడాలంటే అది వైఎస్ జగన్తోనే సాధ్యమని నమ్ముతాను అని తెలియచేశారు.
రాజన్న పాలన జగన్ తీసుకువస్తారు అని ఆమె తెలియచేశారు ప్రజల్లోనే ఈ పదేళ్ల పాటు జగన్ ఉన్నారు అని పాదయాత్రలో అందరి సమస్యలు తెలుసుకుని వారికి నేను ఉన్నాను అనే భరోసా ఇస్తున్నాడు జగన్ అని ఆమె తెలియచేశారు. ఎన్నికల ప్రచారంలో జగన్ నామం జపిస్తున్నాడు చంద్రబాబు అని ,ఎవరైనా అభివృద్ది చెబుతారు కాని జగన్ నామస్మరణ చేస్తున్నాడు బాబు అని ఆమె విమర్శించారు .. ఉదయం 10 గంటలకు కందుకూరులో జరిగే ప్రచార సభలో ఆమె పాల్గొన్ని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కనిగిరిలో జరిగే సభలో విజయమ్మ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మార్కాపురంలో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి విజయమ్మ మర్కాపురంలోనే బస చేస్తారు.