వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ షర్మిల వైయస్ విజయమ్మ ఈసారి స్టార్ క్యాంపెయినర్లుగా ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు.. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రచారం చేస్తున్నారు, ఇక వైసీపీ తరపున జగన్ ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఇక ఎన్నికలకు మరో 13 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పెద్ద ఎత్తున ప్రచారానికి పార్టీలు సిద్దం అయ్యాయి. తాజాగా విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచార తేదీలు ఖరారు అయ్యాయి మరి ఆ వివరాలు చూద్దాం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఎన్నికల ప్రచార షెడ్యూల్
28 మార్చ్ 2019– పులివెందులలో ఇడుపులపాయ వైయస్సార్ ఘాట్లో నివాళులు
29 మార్చ్ – ప్రకాశం జిల్లా కందుకూరు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలు
30 మార్చ్ – ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాలు
31 మార్చ్ – శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాలు
శ్రీమతి వైయస్ షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్
29 మార్చ్ – గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం
30 మార్చ్ – గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలు
31 మార్చ్ – గుంటూరు జిల్లా తాడికొండ, పెదకూరపాడు, నర్సరావుపేట నియోజకవర్గాలు