బ్రేకింగ్ – వైయ‌స్ జగన్ ఇంట విషాదం వైయ‌స్ భార‌తి తండ్రి క‌న్నుమూత

బ్రేకింగ్ - వైయ‌స్ జగన్ ఇంట విషాదం

0
108

ప్ర‌ముఖ వైద్యుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వయానా మామ ఈసీ చిన్న గంగిరెడ్డి కన్నుమూశారు, క‌డ‌ప జిల్లాలో ఎంతో పేరున్న డాక్ట‌ర్ గా గంగిరెడ్డి ఉన్నారు, అంతేకాదు దాదాపు 30 ఏళ్ల నుంచి వైయ‌స్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న వ్య‌క్తి, ఆయ‌న ఇక లేరు అనే వార్తతో జిల్లా ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఈసీ చిన్న గంగిరెడ్డి జగన్ సతీమణి భారతి తండ్రి… జ‌గ‌న్ కు స్వ‌యానా మామ అవుతారు, ఆయ‌న‌కు కొంత‌కాలంగా అనారోగ్యంగా ఉంటోంది, ఇటీవ‌ల ఆయ‌న‌ని క‌డ‌ప నుంచి హైద‌రాబాద్ కు తీసుకువ‌చ్చి అక్క‌డ చికిత్స అందించారు, కాని ఆయ‌న‌కు సీరియ‌స్ అవ్వ‌డంతో క‌న్నుమూశారు.

ఆయన పులివెందులలో పేదల వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. ఇటీవలే సీఎం జగన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రిలో ఉన్న తన మామను పరామర్శించి వచ్చారు. ఆయ‌న అంతిమ సంస్కార కార్య‌క్ర‌మాల‌కు సీఎం జ‌గ‌న్ వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న చేసిన సేవ గురించి అంద‌రూ గుర్తు చేసుకుంటున్నారు.