వైఎస్ భారతి తండ్రికి అనారోగ్యం… హైదరాబాద్ కు సీఎం జగన్..

వైఎస్ భారతి తండ్రికి అనారోగ్యం... హైదరాబాద్ కు సీఎం జగన్..

0
121

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామ, వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు… గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు…

ఈ నేపథ్యంలో జగన్ తిరుపతి నుంచి నేరుగా హైదరాబాబు కు చేరుకున్నారు.. ఆసుపత్రిలో జగన్ తన మామ గంగిరెడ్డిని పరామర్శించారు.. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు…

కాగా ఈ రోజు శ్రీవారి దర్శనం తర్వాత జగన్ కర్నాటక సీఎం యడియూరప్ప తో కలిసి కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.. అక్కడ నుంచి తిరుపతికి చేరుకుని రెణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు.