వైయస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉండి, తాజాగా పాదయాత్ర తర్వాత ఏపీలో ముఖ్యమంత్రి అయ్యారు, అయితే వైయస్ జగన్ కేంద్రంతో కలిసి పని చేస్తారా లేదా అనే అనుమానం చాలా మందికి ఉండేది ..కాని ఆయన బీజేపీకి ఏ విషయంలో అయినా మద్దతు ఇచ్చారు..
అంతే కాని ఎన్డీయేతో ఎక్కడా కలవలేదు.. బీజేపీ జగన్ ఇద్దరూ దూరంగానే ఉన్నారు. తాజాగా ఆయన ఎన్డీయేలో చేరుతారు అని వార్తలు వస్తున్నాయి ..అంతేకాదు త్వరలో ఆయన పార్టీకి సంబంధించి ఎంపీకి కేంద్రమంత్రి పదవి కూడా వరించనుంది అంటున్నారు.. పైగా ఆ మంత్రి పదవి కూడా వైయస్ జగన్ సోదరి షర్మిలకు ఇవ్వనున్నారట.. రెండు రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది.
అన్నీ కుదిరితే ముందు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని తెలుస్తోంది, షర్మిలకు ఏపీ నుంచి రాజ్యసభ పదవి ఇవ్వనున్నారట.. ఆమె కి ఈ పదవి ఇవ్వాలి అని జగన్ ఆలోచన అని తెలుస్తోంది, తర్వాత టెక్నికల్ సమస్యలు ఉండవు అని భావిస్తున్నారట… అందుకే ఆమెకి కేంద్రంలో మంత్రి పదవి రానుంది అని తెలుస్తోంది .అయితే నేడు లేదా రేపు దీనిపై క్లారిటీ రానుందంటున్నారు విశ్లేషకులు.